కొత్త పోస్టులు సృష్టిస్తే రూ. 100 కోట్ల భారం : అనిత 1 y ago
AP : రాష్ట్రంలో 1995 బ్యాచ్ సీఐలు 65 మంది ఉన్నారని తెలిపారు మంత్రి వంగలపూడి అనిత. ఆరేళ్లు పూర్తి చేసుకున్న సీఐలు 852 మంది ఉన్నారన్నారు. కొత్త పోస్టులు సృష్టిస్తే ఏడాదికి రూ. 100 కోట్లు భారం పడుతుందన్నారు. పదోన్నత కల్పిస్తే రూ.17 కోట్ల అదనపు భారం భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సీనియారిటీ జాబితాపై కొందరు కోర్టుకు వెళ్లడంతో సూపర్ న్యూమరీ పోస్టులు కూడా ఇవ్వలేకపోతున్నామన్నారు.